బాబుగారి పాలనలో బంది పోట్ల దోపిడి.. విజయసాయి రెడ్డి కామెంట్స్..!

Tuesday, August 13th, 2019, 04:31:23 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు.

అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్ది ఎన్నికల ముందు నుంచి టీడీపీపై ఆరోపణలు చేస్తూ చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారాడు. ఇక ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడంతో టీడీపీ నేతలపై, చంద్రబాబుపై మరింత అరోపణలు మొదలుపెట్టాడు. అయితే తాజాగా మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించాడు. మోదీని గద్దె దింపేంత వరకు నిద్ర పోయేది లేదని దేశమంతా తిరిగి అందరినీ ఆగం పట్టించిన చంద్రబాబు కోసం ఫరూఖ్ అబ్దుల్లా, మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే దొరకడం లేదట. అందరినీ రెచ్చగొట్టి తను మాత్రం 370 రద్దుకు మద్ధతు ఇవ్వడంపై నిలదీయాలనుకుంటున్నారట అంటూ వయసుకు తగిన మానసిక పరిణితి లేని లోకేశ్‌ కంటికి ప్రతిదీ స్కామ్‌ లాగానే కనబడుతుంది. ఐదేళ్లు అడ్డూ అదుపు లేకుండా దోచుకున్న వాళ్లకి ఎదుటి వారి మీద బురద చల్లడం తప్ప ఇంకేం తెలుస్తుంది. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంటే హర్షించ లేని కుటిల మనస్తత్వం వీరిది. పిల్లల మధ్యాహ్న భోజనం, బాలికల సైకిళ్లు, చివరకు స్కూల్‌ విద్యార్థులకు ఇచ్చే బూట్లలో కూడా తెలుగు దొంగల పార్టీ నేతలు కమిషన్లు దండుకున్నారు. బాబు గారి పాలనలో బందిపోట్ల దోపిడీ లేని పథకమే లేదు. వీళ్లందరి నేరాలు రుజువైతే రాష్ట్రంలో జైళ్లు సరిపోవేమో అంటూ ఎద్దేవా చేసారు.