బ్రేకింగ్: చంద్రబాబుకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి..!

Thursday, June 6th, 2019, 12:25:55 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు సీఎం జగన్. అయితే ముందు నుంచి పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ, రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి జగన్ వెంటే ఉంటూ అన్ని వ్యవహారాలను, పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

అయితే ఎన్నికల ముందు నుంచే విజసాయి రెడ్డి టీడీపీపై, చంద్రబాబు చేసిన తప్పులపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. అయితే ఎన్నికల ఫలితాలలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం కూడా జరిగిపోయాయి. అయితే టీడీపీ మాత్రం ఊహించని పరాభవాన్ని మూటగట్టుకుని పార్టీనీ కాపాడుకునే స్థిలోకి వెళ్ళిపోయింది. అయినా కూడా ఏదో ఒక సందర్భంలో విజయసాయి రెడ్ది చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే తాజాగా నిన్న సీఎం జగన్‌కు ప్రజావేదిక భవనాన్ని తమ పార్టీకీ కేటాయించలంటూ లేక ద్వారా కోరిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా అంటూ ఎద్దేవా చేశారు. ఆ భవనం ఉంటుందా, పోతుందా అనే సంశయం తప్ప చంద్రబాబుకు ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తి అమరావతిలో సొంత ఇల్లు కట్టుకునే ఆలోచననే లేకపోవడం నిజంగా విడ్డూరం అని అన్నారు.