దేవినేని ఉమాకు విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.!

Saturday, June 27th, 2020, 09:50:14 AM IST

ఎప్పుడైతే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వారిపై విమర్శలను తీవ్ర స్థాయిలో ఎక్కు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చి టీడీపీ అక్రమ కట్టడాలను కూల్చివేతతో మొదలు పెట్టారు. దీనితో టీడీపీ నేతలకు మరింత ఆగ్రహం వచ్చింది.

ఆ ఘటనతో మరింత స్థాయి విమర్శలు జగన్ ప్రభుత్వంపై గుప్పించారు. అయితే ఇదిలా ఉండగా ఈ ప్రజా వేదికలను కూల్చినందుకు గాను వాటికి టీడీపీ నేతలు సంవత్సరీకం చేశారట. అలా చేసిన టీడీపీ కీలక నేత దేవినేని ఉమకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

“ప్రజావేదిక అక్రమ నిర్మాణం కాబట్టే ప్రభుత్వం కూల్చేసింది. అదేదో మీ సొంత ఇల్లును నేలమట్టం చేసినట్టు సంవత్సరీకాలు జరపుకోవడం ఏమిటి ఉమా. మీ ప్రభుత్వ అవినీతి చిహ్నం ఆ రేకుల షెడ్డు. అందుకే తేదీ గుర్తుపెట్టుకుని శోకాలు పెడుతున్నారు. ప్రజలకు ఏదైనా సేవ చేయండయ్యా. అంతా హర్షిస్తారు.” అంటూ సంచలన ట్వీట్ పెట్టారు.