చంద్రబాబుపై మరో సాలిడ్ పంచ్ వేసిన విజయసాయి రెడ్డి!

Sunday, August 25th, 2019, 05:12:36 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏ రేంజ్ లో సెటైర్లు వేస్తారో అందరికి తెలిసిందే.ఎన్నికలకు ముందు అలాగే ఎన్నికల తర్వాత కూడా విజయసాయి రెడ్డి చంద్రబాబును మరియు వారి తెలుగుదేశం పార్టీ నేతలను తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.అయినా చంద్రబాబుపై మాత్రం కాస్త వెరైటీగా వ్యంగ్యంగా విమర్శలు చేస్తారు.తాజాగా టీడీపీకు చెందిన మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనంతా తన ఇంటికి తరలించుకున్నాడని వచ్చిన వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఈ విషయాన్ని వైసీపీ నేతలు అయితే గట్టిగానే ఎట్టి చూపి తెలుగు తమ్ముళ్లను ఆడుకున్నారు.ఇప్పుడు మళ్ళీ ఇదే విషయాన్ని చెప్పి విజయసాయి రెడ్డి చంద్రబాబుకు మరో సాలిడ్ పంచ్ వేశారు.చంద్రబాబు తాను కూర్చున్న చోటునే వీధిలో లైట్ వెలిగిందో లేదో కూడా తెలుసుకోగలను అన్న మాటలను గుర్తు చేస్తూ వీధిలో లైట్లు,పబ్లిక్ టాయిలెట్ల ఫొటోలో తన డాష్ బోర్డులో చూసే చంద్రబాబుకు కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ నొక్కెయ్యడం కూడా తెలిసే ఉంటుంది..అందుకే స్పందించడం లేదంటూ దిమ్మతిరిగే కౌంటర్ వేశారు.