విజయసాయిరెడ్డి– జనసైనికులకు ఇదే సలహా ఇస్తున్నారా?

Wednesday, November 13th, 2019, 01:20:55 PM IST

జగన్ తీసుకున్న నిర్ణయం విపక్షాలకు నిద్ర లేకుండా చేస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పెద్ద దుమారాన్నే లేపాయి. వాటికీ పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి? అని అన్నారు. అయితే ఈ విషయం లో వైసీపీ నేతలు పవన్ కి ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ముందున్నారు.

జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా నిత్యా కళ్యాణం గారు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేసారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి? అని ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైన చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు అని దుయ్యబట్టారు. ప్యాకేజీ స్టార్లు, వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేని వారు ప్రజా నాయకులూ కాలేరు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ విషయంలో విజయసాయిరెడ్డి పై ఊహించని రీతిలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయాన్నీ సమస్యని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.