బ్రేకింగ్ న్యూస్: పవన్ కళ్యాణ్ పరువును గంగలో కలుపుకుంటున్నారు–విజయసాయి రెడ్డి

Wednesday, December 11th, 2019, 12:35:30 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ఫై వైసీపీ నేతలు చేస్తూనే వున్నారు. అయితే పవన్ దిశ హత్యోదంతం ఫై, నిందితుల శిక్ష గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల ఫై మరొకసారి విజయసాయి రెడ్డి విమర్శలు చేసారు. అంతేకాకుండా సోషల్ మీడియా లో రాజకీయాల ఫై, సమస్యల ఫై కొందరు స్పందించే విధానం గూర్చి తెలియజేస్తూ పవన్ ఫై విమర్శలు చేసారు.

సోషల్ మీడియా సృజన, స్పందించే తీరు చాల ఆశ్చర్యకరంగా ఉంటుందని వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పావలాకి బెత్తం స్టార్ అని పేరు పెట్టారు, అది కాస్త వైరల్ అయిందని సెటైర్లు వేశారు. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తనని పవర్ స్టార్ అని పిలవొద్దు అని తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, అందుకే తనని పవర్ స్టార్ అని పిలవొద్దు అని పిలుపునిచ్చాడు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేసారు. అయితే ఆలోచనలో పరిపక్వత లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడి పరువు గంగలో కలుపుకుంటున్నారని పవన్ ఫై విజయసాయి రెడ్డి విమర్శలు చేసారు.