మీ సయామీ ట్విన్ పార్టీ తెరాస అధినేత కేసీఆర్ గార్కి చెప్పలేదా – విజయశాంతి

Tuesday, June 8th, 2021, 01:00:43 PM IST


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరాస పై మరోమారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి నిప్పులు చెరిగారు. అయితే కొవిడ్ వాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఓవైసీ జి అంటూ అసదుద్దీన్ ఓవైసీ ను ఉద్దేశించి అన్నారు. అయితే ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి అని తెలిపారు. 2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ తెరాస అధినేత కేసీఆర్ గార్కి చెప్పలేదా అంటూ సేటర్సు వేశారు.

అయితే 25 శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వడం వీఐపి కల్చర్ అయితే, తెరాస రాష్ట్ర ప్రభుత్వం కి వాక్సిన్ కొనుగోలు ఇవ్వాలి అని అడుగుతున్నాది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.