ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్రు – విజయశాంతి

Saturday, June 5th, 2021, 03:00:43 AM IST

బీజేపీ నాయకురాలు విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు లేరన్న ఈటల గారి ప్రకటనపై ముందుగా ఎందుకు చెప్పలే అని టీఆర్ఎస్ ప్రతి విమర్శలు చేసే బదులు, వెంటనే నియామకం చెయ్యవచ్చు కదా అని సమర్థులైన ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఉన్నారు కదా అని ప్రశ్నించారు. సీఎం గారి కుటుంబ దోపిడీ కథలు వేరే అధికారులొస్తే బయటపడతాయని భయమేదైనా ఉందా అంటూ, కాంగ్రెస్ నుంచి గెలిచిన అనేకమంది ఎమ్మెల్యేలను పదవితో సహా గుంజుకున్న టీఆర్ఎస్ ఈటలగారు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్రు అని నిలదీశారు.

అయితే నక్సలైట్ ఎజెండా నా ఎజెండా అని చెప్పిన కేసీఆర్ గారు, వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను ఎన్‌కౌంటర్ చెయ్యొచ్చు.. సీఎం అండ్ కో వేల ఎకరాల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడవచ్చు. ఈటల భావజాలం మాత్రం ప్రశ్నిస్తామంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఇదంతా కేవలం బీజేపీలో చేరికపై భయంతోనే అన్నది స్పష్టమయ్యిందని, రైతు చట్టాలపై ఈటలగారు బీజేపీతో మాట్లాడాలంటున్న టీఆర్ఎస్ ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ రైతులనెందుకు పలుకరించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని వీజయశాంతి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ బాజాప్తాగా మతతత్వ ఎంఐఎంతో అవగాహన కొనసాగితే అది సెక్యులరిజం.. కోట్లాది భారతీయుల ఆదరణతో ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ముందుకెళ్తున్న బీజేపీలో చేరటం మాత్రం అలౌకిక వాదమా? ఇది కేవలం మెజారిటీ హిందువుల పట్ల టీఆర్ఎస్ తేలిక భావమే అని వ్యాఖ్యానించారు.