తమిళనాడు కాబినెట్ లోకి విజయశాంతి ?

Thursday, February 23rd, 2017, 12:07:01 PM IST


సౌత్ లో హీరోయిన్ గా ఎవరికీ లేని ఫాలోయింగ్ సంపాదించుకున్న లేడి అమితాబ్ విజయ శాంతి గత కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఆ తరువాత ఆ పార్టీని టీఆరెస్ లో విలీనం చేసిన విజయశాంతి ఆ తరువాత మెదక్ ఎంపీ గా కూడా గెలిచారు. కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆమె టీఆరేస్ నుండి విడిపోయి కాంగ్రెస్ లో చేరి, మెదక్ ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయాల్లో సైలెంట్ అయిన ఈమె ఇప్పుడు తమిళనాడు రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే శశికళపై సపోర్ట్ అందించిన విజయశాంతి త్వరలోనే తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జయలలిత, శశికళ లేని అన్నా డి ఎం కె పార్టీ లో కీలకమైన మహిళలు లేకుండా పోవడం కూడా ఆ పార్టీ కి తీరని లోటుగా ఉంది. దాంతో కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి త్వరలోనే అన్నా డిఎంకే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ క్యాబినెట్ లో చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. విజయశాంతికి తమిళనాడులో కూడా మంచి క్రేజ్ ఉంది, ఈ నేపథ్యంలో అన్నా డిఎంకె పార్టీకి సినీ గ్లామర్ ను జోడించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.