కెసిఆర్ పై మండిపడుతున్న కాంగ్రెస్ నాయకురాలు – కారణం ఏంటో…?

Thursday, July 11th, 2019, 01:52:25 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రంగా సీరియస్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. తెలంగాణాలో ఉన్నటువంటి కొన్ని భవనాలను అన్నింటిని అనవసరంగా కూల్చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు ఫైర్ బ్రాండ్ విజయశాంతి. ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి పై మరియు తెరాస ప్రభుత్వంపై కేంద్రంనిఘా వేయడాన్ని స్వాగతిస్తానని చెబుతున్నారు విజయశాంతి. అధికార గర్వంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల నోరునొక్కిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రానికి మాత్రం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు. కెసిఆర్ చేసే అన్యాయాలు అక్రమాలు చూసుకుంటా ఎవరు ఖాళీగా ఉండరని చెబుతున్నారు. కేంద్రం చర్యలు తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ నేతలు అందరూ కూడా కేంద్రానికి మద్దతు ఇస్తామని విజయశాంతి అన్నారు.

రాష్ట్రంలో విపక్షాన్ని లేకుండా చేయడమనేది ప్రజాస్వామ్యానికి అమర్యాద పరచడమే అని విజయశాంతి ఘాటుగా వాఖ్యానించారు. అంతేకాకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని బెదిరించారని విజయశాంతి గుర్తుచేశారు. దీనికి సంబంధించి కెసిఆర్ ప్రభుత్వంలో జరుగుతున్నా పరిణామాలపై కేంద్రం నిశితంగా ద్రుష్టి సారించిందని అన్నారు. ఈమేరకు రాష్ట్రంలో జరిగే అవకతవకలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుందని ఇటీవల బీజేపీ నేతల వ్యాఖ్యలను ప్రస్తావించారు. కెసిఆర్ చేసే కుట్రపూరితమైన రాజకీయాలకు కాలం చెల్లిందని విజయశాంతి అన్నారు.