తెరాస ప్రభుత్వం పై మండిపడుతున్న రాములమ్మ…

Sunday, August 18th, 2019, 01:00:24 AM IST

తెలంగాణాలో అధికారంలో ఉన్నటువంటి తెరాస ప్రభుత్వం పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని తెరాస పార్టీ అధినేత కెసిఆర్ చాలా అక్రమాలకూ పాల్పడుతున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణాలో చాలా బరిదెగించి రాజకీయాలు నడుపుతున్నారని విజయశాంతి అన్నారు. అయితే తెలంగాణాలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కారు అడ్డదారుల్లో అనవసరమైన రాజకీయాలకు తెరలేపుతున్నారని విజయశాంతి ఆరోపిస్తున్నారు. కాగా తాజాగా హై కోర్టులో వారు చేసిన వాఖ్యలు వింటే తెరాస ప్రభుత్వం చేసే కుట్రపూరితమైన రాజకీయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయని విజయశాంతి అన్నారు.

కాగా మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల విభజనను హైకోర్టు నామమాత్రంగా ప్రకటించిందని, ఈమేరకు విచారణ సరిగ్గా జరిగితే ఆ విచారణలో మరిన్ని వాస్తవాలు బయటపడతాయని, వాటిరో పాటే తెరాస పార్టీ చేస్తున్న అక్రమాలు కూడా బయటపడతాయని, అందుకనే ఇలాంటి మెరుగైన విచారణలు జరగకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుంటుందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తెరాస ప్రభుత్వ అక్రమాలు ఈ విచారణలో బయటపడితే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ కి పెద్ద దెబ్బ పడ్డట్టే అని అన్నారు.