ఆ కేసుల వివరాలను ప్రభుత్వం ప్రకటించాలి.. విజయశాంతి డిమాండ్..!

Saturday, February 20th, 2021, 12:35:32 AM IST


టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా సరికొత్త డిమాండ్ వినిపించింది. అధికార పార్టీ నేతలు చాలా సందర్భాలలో నిందితులను తప్పించడం, బలహీనమైన చార్జిషీట్లు వేయించి, కేసుల విచారణలో సరైన శ్రద్ధ వహించకపోవడం వల్ల అనేకమంది నేరం చేసి కూడా బయటపడుతున్నారని అదే విధంగా ఏదో ఒక కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్న నేరస్తుల కేసులను పై కోర్టులలో అప్పీలు చెయ్యకుండా ప్రభుత్వం లాలూచీ ధోరణితో వ్యవహరించడం అత్యంత దారుణమని అన్నారు.

అయితే విచారణలో తప్పించుకున్న క్రిమినల్స్ మరల దారుణమైన నేరాలకు పాల్పడుతుండటం చూస్తున్నామని, తెలంగాణలో ఇంతవరకూ అప్పీళ్ళకు పోని నేరారోపిత కేసుల వివరాలు మొత్తం ప్రభుత్వం ప్రకటించి, అందుకు కారణాలేమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని, ఆ విధంగానైనా ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.