100 కోట్లు.. 10 మంది డైరెక్ట‌ర్ల ప‌రిచ‌యం!

Friday, July 27th, 2018, 09:53:07 PM IST


వెబ్ సిరీస్‌లు, టెలీ సిరీస్‌లు, ఫీచ‌ర్ సినిమాలు .. ప్లాట్‌ఫామ్ ఏదైనా యంగ్ డైరెక్ట‌ర్ల‌కు స‌ద‌వ‌కాశ‌మిది. స‌త్తా ఉంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌, ఈరోస్ వంటి సంస్థ‌లు భారీ అవ‌కాశాలిస్తున్నాయి. ఇంత ట్యాలెంటు ఉంటే, అంత పెద్దగా దూసుకుపోయే ఛాన్సుందిక్క‌డ‌. ఇప్పుడు ఈ విభాగంలోకి టాలీవుడ్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప్ర‌వేశించారు. ఆయ‌న‌కు ఉన్న అపార విజ్ఞానంతో ఇప్ప‌టికే ప‌ది క‌థ‌లు రాశారు. ఆ క‌థ‌ల‌న్నిటి కోసం ప‌ది మంది డైరెక్ట‌ర్ల‌ను సెల‌క్ట్ చేశార‌ట‌. దీనికి పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌ఖ్యాత ఈరోస్ ఇంట‌ర్నేషన‌ల్ సంస్థ ముందుకు వ‌చ్చింది.

ఈరోస్‌తో విజ‌యేంద్రుని బిగ్‌ డీల్ రీసెంటుగానే సెట్ట‌య్యింది. ఈ డీల్ విలువ దాదాపు 100 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని చెబుతున్నారు. బాహుబ‌లి, భ‌జ‌రంగి భాయిజాన్ రైట‌ర్‌గా విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కి ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. అత‌డు ఏ క‌థ రెడీ చేసినా దానికి అంతే డిమాండ్ ఉంటోంది. ఈ ఊపులోనే ఆయ‌న ఓ ప‌ది క‌థ‌లు రాసుకుని, ఏకంగా 8-10 మంది ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నార‌ట‌. అన్న‌ట్టు ఈ క‌థ‌ల్ని రాసేందుకు త‌మ్ముడు కాంచీని ఆయ‌న ప‌క్కాగా ఉప‌యోగించుకుంటున్నార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments