షాక్ .. భారీ నష్టాల్లో విజయ్ మెర్సల్ సినిమా ?

Saturday, December 2nd, 2017, 12:00:49 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం మెర్సల్ .. భారీ నష్టాల్లో కూరుకుపోయింది. అట్లీ కుమార్ దర్శకత్వంలో సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా విడుదల సమయంలో సంచలనం క్రియేట్ చేసిందంటూ జోరుగా వార్తలు వచ్చాయి . మొదటి వారం .. వంద, రెండో వారం రెండొందల కోట్లు బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టినట్టు ప్రచారం జరిగింది … కానీ సినిమా లాంగ్ రన్ లో నిలవలేకపోయింది .. దాంతో సినిమాకు భారీ నష్టాలూ వాటిల్లాయి. ఈ సినిమా విషయంలో ముక్యంగా జి ఎస్ టి పై వచ్చిన డైలాగ్స్ తో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం .. కొన్ని ఏరియాల్లో సినిమా విధులను ఆపేయడం లాంటి అంశాలతో ఈ లాస్ వచ్చిందట. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేసారు .. అయితే విడుదల విషయంలో ఎక్కువ ఆలస్యం కావడంతో ఇక్కడ మంచి ఓపెనింగ్స్ ని అందుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు .. మొత్తానికి మెర్సల్ సినిమాకు ఏకంగా 60 కోట్ల నష్టం వచ్చినట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ సరసన నిత్యా మీనన్, కాజల్, సమంత హీరోయిన్స్ గా నటించారు.

  •  
  •  
  •  
  •  

Comments