విక్రమ్ పై 300 కోట్ల బెట్టింగ్ వర్కవుట్ అవుతుందా ?

Monday, January 29th, 2018, 05:50:48 PM IST

విక్రమ్ .. జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో విక్రమ్ ఐ లాంటి భారీ డిసాస్టర్ తరువాత తన కెరీర్ విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాడు. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో ఆయనను సరైన కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటి లేదు. తాజాగా స్కెచ్ అంటూ ఓ మాస్ చిత్రంతో వచ్చిన విక్రమ్ కు తమిళంలో యావరేజ్ హిట్ గా నిలబడింది. ఈ చిత్రాన్ని అదే పేరుతొ తెలుగులో ఇంకా విడుదల చేయలేదు. మరో వైపు విక్రమ్ అంటే క్రేజ్ కూడా బాగా తగ్గినా నేపథ్యంలో ఆయనపై భారీ జూదం ఆడుతున్నారు. విక్రమ్ కీ రోల్ లో కర్ణ అనే పేరుతొ ఏకంగా 37 భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్లు ? మహాభారతం నేపథ్యంలో కర్ణుడి పాత్ర కీలకంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన ప్రముఖ నటులు ఉంటారట. అయితే ఇన్ని భాషల్లో ఇంత భారీ బడ్జెట్ ను విక్రమ్ ను నమ్మి పెడుతున్నారు అది వర్కవుట్ అవుతుందా అంటూ సందేహాలు ఎక్కువవుతున్నాయి. త్వరలోనే కర్ణ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట !!