కమల్ తో చియాన్ విక్రమ్ సినిమా.. ఫిక్స్ !

Saturday, January 20th, 2018, 03:22:18 PM IST

కొలువుడ్ హీరోలు ప్రయోగాలు చేయడంలో ముందుంటారు అని అందరికి తెలిసిన విషయమే. కథ నచ్చితే ఎలాంటి సాహసాలకైనా సిద్ధమవుతారు. అలాంటి హీరోల్లో కమల్ హాసన్ – చియాన్ విక్రమ్ ఒకరు. అయితే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది?. ఉహించుకుంటుంటేనే సినిమా ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నారు కదా!. ఇప్పటికైతే అలాంటి అదృష్టం లేదు గాని భవిష్యత్తులో తప్పకుండా అవుతుంది. ఇప్పటికైతే కమల్ ప్రొడక్షన్ లో విక్రమ్ హీరోగా ఒక సినిమా సెట్ అయ్యింది. కమల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కథానాయికగా కనిపించనుంది. ఇక సినిమాకు రాజేష్ సెల్వ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు అతను కమల్ తో చీకటి రాజ్యం అనే సినిమాను చేశాడు. ఆ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. అయితే ఇప్పుడు చేయబోయే కథ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.