తమిళ రీమేక్ లో బాలీవుడ్ బాద్షా ?

Friday, April 20th, 2018, 07:06:12 PM IST

తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించేది ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. తమిళంలో జులై లో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేద ఈ చిత్రాన్ని అటు తెలుగులోను రీమేక్ చేయాలనీ ప్లాన్ చేసారు. పుష్కర్ గాయత్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మరి వీళ్ళే దర్శకత్వం వహిస్తారా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని, భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఓ నిర్మాణ సంస్థ సిద్ధం అయిందట.

  •  
  •  
  •  
  •  

Comments