చేతివాటం ప్రదర్శిస్తున్న గ్రామ వాలంటీర్లు…ఆత్మహత్యకు అసలు కారణం అదే!

Tuesday, November 19th, 2019, 02:28:00 PM IST

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగాల రూపకల్పన పేరుతో గ్రామ వాలంటీర్ల ను నియమించారు. అయితే చిన్న చిన్న ప్రభుత్వం పనులు చేయడానికి వీరిని నియమించుట కాకుండా, ప్రభుత్వం సంక్షేమ అమలులో కూడా వీరి పాత్ర కీలకం అని చెప్పాలి. కింది స్థాయి ఉద్యోగులు సైతం సరిగ్గా పని చేస్తేనే రాష్ట్రానికైనా, ప్రభుత్వానికైనా పేరు వస్తుంది. అయితే అనంతపురం జిల్లా ఓబుళాపురం మండలంలో అలా జరగలేదు.

అనంతపురం జిల్లా ఓబుళాపురం మండలానికి చెందిన గోపినాథ్ గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే నవంబర్ నెల ఫించన్లని పంపిణి చేసే క్రమం లో రూ. 84,250 సొంత అవసరాలకు వాడుకున్నాడు. అయితే వాటిని తీర్చడానికి వేరే మార్గం దొరకక ఆత్మహత్యే శరణ్యం అనుకోని ఉరి వేసుకున్నాడు. ఇదే సమయం లో జగ్గయ్యపేటకు చెందిన మరొక గ్రామ వాలంటీర్ సురేష్ ఒంటరిగా వున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు తెంచుకొని పారిపోయాడు. అయితే ఈ విషయంలో ప్రజలు వైసీపీ గ్రామ వాలంటీర్లా మజాకా అంటూ ఇదే కదా రాజన్న రాజ్యం అంటూ విమర్శలు చేస్తున్నారు.