వల్లభనేనికి షాక్ ఇచ్చిన గ్రామ వాలంటీర్లు.. అనుచరుడి బెదిరింపులు..!

Tuesday, December 10th, 2019, 02:07:41 AM IST

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వల్లభనేని వంశీపై తాజాగా గ్రామ వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు అయిన యతేంద్ర రామకృష్ణ అలియాస్ రాము అనే వ్యక్తి గ్రామ వాలంటీర్లపై దౌర్జన్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే వంశీ అనుచరుడు రాము అనే వ్యక్తి గ్రామ సచివాలయంకి వచ్చి ఉద్యోగులపై దౌర్జన్యం చేశారని, అసభ్యపదజాలంతో మాట్లాడి అంతు చూస్తానని బెదిరించారని గ్రామ సచివాలయం ముందే వాలంటీర్లు ధర్నాకు దిగారు. అయితే గ్రామ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని ఇలాంటి వాటిని అధికారులు పట్టించుకోక, పోలీసులు పట్టించుకోకపోతే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు వల్లభనేనికి వ్యతిరేకంగా గ్రామ సచివాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.