హేయ్‌.. అల్లుడు శీనుకి 4 ఏళ్ల వ‌య‌సు

Wednesday, July 25th, 2018, 10:18:03 PM IST


అల్లుడు శీను రిలీజై అప్పుడే నాలుగేళ్ల‌యిపోయిందా? ఇది ఎంతో స‌ర్‌ప్రైజింగ్ అని అన్నారు స్టార్‌డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌. సాక్ష్యం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న శ్రీ‌నుకి బ్లెస్సింగ్స్ అందించాడు. నాలుగేళ్లలో శీనూలో ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తోంద‌ని పొగిడేశారు. పెద్ద స్టార్ అయ్యే ఛాన్సుంద‌ని, అవ్వాల‌ని ఆకాంక్షించారు. బెల్లంకొండ శ్రీ‌నుని వినాయ‌క్ మ‌న‌సారా ఆశీర్వ‌దించారు. శ్రీ‌ను ఇంకా 4 సినిమాల కిడ్ అయినా యాక్ష‌న్ స్టార్‌గా ఎదిగేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు చేయ‌ని ప్ర‌య‌త్న‌మే లేదు. ఇప్పుడు విన‌య్ ఆశీస్సులు అందించారు కాబ‌ట్టి సాక్ష్య ంతో అనుకున్న‌ది సాధిస్తాడేమో చూడాలి.

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌- పూజా హెగ్డే జంట‌గా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వ ంలో అభిషేక్ నామ నిర్మించిన సాక్ష్యం ఈనెల 27న రిలీజ‌వుతోంది. తాజాగా సెన్సార్ పూర్త‌యి, యుఎ సర్టిఫికెట్ ద‌క్కింది. రిలీజ్ ముంగిట ప్ర‌మోష‌న్స్‌లో ఓ పాట‌ను లాంచ్ చేసిన వినాయ‌క్ పైవిధంగా స్పందించారు. మీడియా స‌మావేశంలో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – అల్లుడుశీను రిలీజ్ అయి నాలుగేళ్ళు అయిందంటే నమ్మలేక‌పోతున్నా. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సినిమా సినిమాకి సాయి శ్రీ‌నివాస్‌లో ప‌రిణ‌తి క‌నిపిస్తోందని ప్ర‌శంసించారు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయ‌ని, సినిమా రిచ్‌గా, గ్రాండ్ గా తీశార‌ని .. అన్నారు. శ్రీ‌ను పెద్ద స‌క్సెస‌వ్వాల‌ని, వాసూకి హిట్ రావాల‌ని ఆకాంక్షించారు.

  •  
  •  
  •  
  •  

Comments