వినాయక్ ఇంత దారుణమా?.. కనీసం సగం కూడా లాగలేదే!

Monday, March 5th, 2018, 12:26:36 PM IST

వరుస పరాజయాలతో సతమతవుతోన్న హీరో సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు. స్టార్ దర్శకుడు వినాయక్ తో మొదటి సారి వర్క్ చేస్తుండడంతో సినిమా కలెక్షన్స్ పరంగా అయినా ఓ లెవెల్లో వసూలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా కనీసం పెట్టిన బడ్జెట్ లో సగాన్ని కూడా అందుకోలేదు. వివి.వినాయక్ కెరీర్ లో కూడా ఇంటిలిజెంట్ ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. సినిమా థ్రియేటికల్ రైట్స్ రూ 27కోట్లకు అమ్ముడుపోగా టోటల్ గా 8 కోట్ల గ్రాస్ ను మాత్రమే అందుకుంది. షేర్స్ పరంగా 3.65 కోట్లను అందుకుంది. కనీసం 5 కోట్ల షేర్స్ కూడా అందుకోలేని ఇంటిలిజెంట్ బయ్యర్స్ కి తీరని నష్టాలను మిగిల్చింది. అయితే వినాయక్ మళ్లీ తన రెమ్యునరేషన్ ని వెనక్కి ఇచ్చేశారని తెలుస్తోంది.