ఎన్నికలు అంటే తుపాకీ పేలాల్సిందే

Thursday, February 23rd, 2017, 04:59:01 PM IST


ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు అనగానే హింస లేకుండా జరగడం అయ్యే పనే కాదు. దేశ రాజకీయాలలో అత్యంత కీలక రాష్ట్రంగా పరిగణిస్తున్న యూపీ లో ప్రస్తుతం అసంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటిదాకా మూడు దశల పోలింగ్ పూర్తి కాగా… పెద్దగా హింస చోటుచేసుకున్న దాఖలా లేదు. దీంతో యూపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అంతా సంతతోషించారు. అయితే నేటి ఉదయం ప్రారంభమైన నాలుగో దశ పోలింగ్ ఆ సంతోషమంతా ఆవిరిపైపోయింది. యూపీ ఎన్నికల్లో కాల్పుల మోత ఇప్పటి దాకా వినపడలేదు కానీ ఇప్పుడు మాత్రం పోలింగ్ బూత్ లలోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. యూపీలోని అధికార పక్షం సమాజ్ వాదీ పార్టీ – విపక్ష బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ పోలింగ్ కేంద్రానికి ఆమడదూరంలో ఎదురెదురుగా మోహరించిన రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పాటు చేతుల్లోని తుపాకులకు కూడా పనిచేప్పాయి.