వైరల్ : లీకైన రజిని 2.0 టీజర్ ??

Sunday, March 4th, 2018, 11:38:54 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ కంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే తదనంతరం వారిరువురి కలయికలో దీనికి సీక్వెల్ గా 2.0 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. భారతీయ చలన చిత్ర చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రం పై అంచనాలు విపరీతంగా వున్నాయి. అయితే ఇప్పటికే అక్టోబర్ లో విడుదలయిన ఈ చిత్రం ఆడియో లోకి పాటకు మంచి స్పందన లభిస్తోంది. అసలు విషయంలోకి వెళితే ఈ చిత్రం తాలూకు టీజర్ ప్రస్తుతం లీక్ అయినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే లీక్ అయిన టీజర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే విషయం వైరల్ గా మారడంతో చివరికి టీజర్ లింక్ ను యూట్యూబ్ సంస్థ తొలగించింది. టీజర్ చూసిన ప్రతివారు నిజంగా ఈ చిత్రం పెద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా టీజర్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అదరహో అనే రీతిలో ఉన్నాయని, ఈ చిత్రం భారతీయ చలన చిత్ర ఖ్యాతిని మరింత పెంచుతుందని తెలుస్తోంది….