వైరల్ న్యూస్ : అడ్డంగా బుక్ అయిన బన్నీ

Monday, April 9th, 2018, 07:36:10 PM IST


ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం ఎక్కువయ్యాక సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో తమ ఖాతాలను తెరుస్తున్నారు. మరికొందరైతే తమ సినిమాలు, అలానే పర్సనల్ లైఫ్ కు సంబందించిన విషయాలను షేర్ చేయడం కోసం వీటిని వేదికగా వాడుకోవడం చూస్తున్నాము. అలానే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎప్పటికపుడు తన సినిమా సంగతులు తన ట్విట్టర్ లో షేర్ చేస్తుంటారు. అయితే ఈ సారి సోషల్ మీడియాలో ఆయన ఒక విషయమై చిన్న చిక్కుల్లో పడ్డారు. మొన్నీ మధ్యే మోదీ తనకు ఇన్సిపిరేషన్ అంటూ బన్నీ ఇచ్చిన స్టేట్ మెంట్ వైరల్ అయి కొంత దుమారం రేపిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు కొత్త చిత్రం నా పేరు సూర్య డైలాగ్ ఇంపాక్ట్ మూలంగా బన్నీని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆయన తన నా పేరు సూర్య లో చెప్పిన డైలాగ్ అని తెలుస్తోంది. అందులో చెప్పే డైలాగు లో ‘సౌత్ ఇండియా, నార్త్‌ ఇండియా, ఈస్ట్, వెస్ట్‌ ఇలా అన్ని ఇండియాలు లేవురా మనకి వున్నది ఒక్కటే ఇండియా’ అంటూ డైలాగ్ చెబుతాడు. అయితే అల్లు అర్జున్ అఫీషియల్ ట్విటర్ ప్రొఫైల్ లో మాత్రం ‘సౌత్ ఇండియన్ యాక్టర్’ అని ఉండటం గమనించిన కొందరు, దేశభక్తి డైలాగులు సినిమావరకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు, రీల్ స్టార్సే తప్ప రియల్ స్టార్స్ కాదంటూ ట్వీట్లు మీద ట్వీట్లు చేస్తూ బన్నీని ఏకేస్తున్నారు.

ఇక యాంటీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బన్నీఅడ్డంగా బుక్ అయినట్లయింది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన నా పేరు సూర్య చిత్రంలో అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ కాగా, అర్జున్, బొమన్ ఇరానీ, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మే 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే…..

  •  
  •  
  •  
  •  

Comments