వైరల్ న్యూస్ : చిట్టిబాబు రికార్డుని భరత్ బద్దలు కొడతాడా?

Wednesday, April 4th, 2018, 07:24:53 PM IST


మెగా పవర్ స్టార్ రాంచరణ్ లేటెస్ట్ సూపర్ హిట్ రంగస్థలం. ప్రస్తుతం ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు అని చెప్పాలి. ముఖ్యంగా నైజాం, అలానే ఓవర్సీస్ మార్కెట్ లలో ఈ సినిమా కలెక్షన్ల దుమ్ము దులుపుతున్నట్లు త్లెలుస్తోంది. ప్రస్తుతం ఎవరికీ సెలవలు లేకపోయినప్పటికీ కలెక్షన్లు మాత్రం స్టడిగా ఉంటున్నాయి. పోతే ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటివరకు 2.8 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. అయితే అక్కడ నాన్ బాహుబలి రికార్డుగా వున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు పేరిట వున్న 2.8 మిలియన్ డాలర్ల రికార్డును రంగస్థలం సునాయాసంగా అందుకుని 3 మిలియన్ దార్లర్లను అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఈ విషయం పక్కనపెడితే ఇక రాబోవు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను ఈ రికార్డును ఎంత మేర అందుకుంటుంది అనే చర్చ ఇప్ప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మొదలయింది. అయితే అసలు మహేష్ బాబుకు ఓవర్సీస్ లో వున్న క్రేజ్ సామాన్యమైనది కాదు అని చెప్పాలి. ఆయన ప్లాప్ సినిమాలు కూడా అక్కడ 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన దాఖలాలు చాలానే వున్నాయి. అదీకాక ఇప్పటికే రెండు ప్లాప్ లతో సతమతం అవుతున్న సూపర్ స్టార్ ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం చిట్టిబాబు రికార్డును ముఖ్యమంత్రి భరత్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఏమి జరుగుతుందో తెలియాలంటే ఈ నెల 20న భరత్ అను నేను విడుదలవరకు వేచివుండాల్సిందే ….