వైరల్ న్యూస్ : శ్రీ రెడ్డితో ఫోటోలో వున్న ఆ హీరో ఎవరు?

Saturday, March 17th, 2018, 03:34:44 AM IST

టాలీవుడ్ లో ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ విషయమై జరుగుతున్న చర్చ రోజురోజుకు పెరుగుతోంది. హీరోయిన్ వేషాలకోసం వస్తున్న అమ్మాయిలను ఇండస్ట్రీ లోని పలువురు కో- ఆర్డినేటర్లు లోబరుచుకుని తమ కోరిక తీరిస్తే తప్ప అవకాశం ఇవ్వమని చెపుతున్నారని ఇటీవల గాయత్రి గుప్తా అనే వర్ధమాన నటి చేసిన ఆరోపణలు మరువకముందే, రెండు మూడు రోజులుగా శ్రీ రెడ్డి అనే హీరోయిన్ కూడా ఈ విషయమై తన గళం విప్పారు. దీనికి సంబంధించి పలు తెలుగు టివి న్యూస్ చానెల్స్ లో ఆమె తన బాధను, ఆవేదనను తెలియచేసారు.

ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాల్లో వైపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే రీసెంట్ గా శ్రీ రెడ్డి ఓ మీడియా ఛానెల్ షో లో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఆ ఛానెల్ వారు అంతకు ముందే ఓ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఓ కో-ఆర్డినేటర్ బూతు పురాణాలను బయటపెట్టారు. ఆ విషయం గురించి మాట్లాడిన తరువాత శ్రీ రెడ్డి ఒక హీరోతో సన్నిహితంగా ఉన్న ఫోటోని బయటపెట్టారు. లైవ్ లోనే మొబైల్ లో చూపించడంతో ఆ ఫొటోలో ఉన్న హీరో కొంచెం గెడ్డం లుక్ తో ఉన్నాడు. శ్రీ రెడ్డి తో సన్నిహితంగా ఉండి ఆఫర్స్ ఇప్పిస్తాను అని చెప్పాడట.

కానీ ఫైనల్ గా అతని వల్ల ఎలాంటి లాభం చేకూరలేదని శ్రీ రెడ్డి వివరించింది. అయితే ఆ ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో పలానా అని కొంత మంది హీరోల పేర్లు సోషల్ మీడీయాలో నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే చాలావరకు ఎక్కువమంది ఓ హీరో వైపు ఎక్కువ వేళ్లు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చాలా మంది హీరోలు అలాంటి స్టైల్ ని మెయింటెన్ చేస్తున్నారు. అలాగని మంచి హీరోలను కూడా అనుమానిస్తే తప్పవుతుంది.

మరి శ్రీ రెడ్డితో జాతకట్టిన ఆ సరసాల కథనాయకుడు ఎవరో తెలియాలంటే నిజానికి ఆ ఛానల్ వారే బయటపెట్టాలని, అలా జీవనాధారం కోసం వచ్చిన అమ్మాయిలను లోబరుచుకుని మానసికంగా, శారీరకంగా హింసించే అలాటి వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు….