వైరల్ ఫోటో : భరత్ అనే నేను న్యూ పోస్టర్ అదుర్స్ !!

Sunday, March 18th, 2018, 02:11:47 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ దర్శకులు కొరటాల శివ దర్శకత్వం లో, ఎమ్ ఎస్ ధోని ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా భరత్ అనే నేను. ఇటీవల విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ విజన్ ఇప్పటికే అత్యధిక లైక్ లు , వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులుపుతోంది. అంతే కాదు ఈ టీజర్ టాలీవుడ్ లో అత్యధిక లైక్ లు పొందిన టీజర్ గా రికార్డ్ సృష్టించింది. అయితే నేడు తెలుగు సంవత్సరాది అయిన ఉగాదిని పురస్కరించుకుని సినిమా యూనిట్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో మహేష్ బాబు అచ్చ తెలుగుదనం ఉట్టిపడే పంచె కట్టులో ముఖ్యమంత్రి గా అదరగొట్టారు అని చెప్పాలి. ప్రస్తుతం విడుదలైన ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి….