వైరల్ ఫోటో : మనవడితో ఎంజాయ్ చేస్తున్న బ్రహ్మానందం

Tuesday, March 20th, 2018, 01:15:19 PM IST

ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం ఒకప్పుడు చేసినన్ని సినిమాలు ప్రస్తుతం చేయడం లేదనే చెప్పాలి. మరి ప్రేక్షకులకు అంతలా వినోదం పంచే మీరు తీరిక వేళల్లో ఏం చేస్తారు అని ఆయనను అడిగితే ఇదిగో ఇలా మనవడితో ఆడుకుంటూ ఉంటానని చెబుతారు. ఇంతకాలం తన ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా పనిచేశానని చెప్పే బ్రహ్మానందం. ఇన్నేళ్లకు రిలాక్సయ్యే సమయం దొరికిందని అంటున్నారు. అలా అని చెప్పడమే కాదు, ఇలా మనవడిని భుజాలపై కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక బ్రహ్మానందం మరోసారి తనదైన శైలి కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎం.ఎల్‌.ఎ. కాజల్‌ కథానాయిక. ఉపేంద్ర మాధవ్‌ దర్శకుడు. ఈ నెల 23న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, ఈనెల 23న ఎం.ఎల్‌.ఎ మంచి లక్షణాలున్న అబ్బాయి సినిమా విడుదలవుతోంది. నేను, పోసాని, పృథ్వీ నటించిన ఒక అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ సినిమా ఇది. దానితో పాటు, కల్యాణ్‌రామ్‌గారి అద్భుత నటన, దర్శకుడి ప్రతిభ మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది, ఆనందపరుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వేసవిలో తేనీటి విందు ఎం.ఎల్‌.ఎ సినిమా తప్పక చూడండి ట్విటర్‌ వేదికగా కోరారు. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి……