వైరల్ ఫొటోస్ : ఎన్టీఆర్ న్యూ లుక్ ఫెంటాస్టిక్

Thursday, March 29th, 2018, 12:49:46 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కలయిక లో వస్తున్న సినిమా పై మొదటినుండి ఆ హీరో, దర్శకులిద్దరు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా పరాజయంతో డైలమాలో పడ్డ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో తన పాత్ర కోసం ఎన్టీఆర్ కూడా చాలా కాలంపాటు జిమ్ లో కష్టపడి స్లిమ్ గా తయారయ్యారు అనే వార్త కొద్ధిరోజులనుండి వస్తోంది.

అయితే ఇప్పటివరకు ఆయన లుక్ ని బయటకి రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే నేడు మాత్రం అనూహ్యంగా ఎన్టీఆర్ కు సంబందించిన న్యూ లుక్ బయటకి వచ్చేసింది. ఆయన ఇటీవల ఐపీఎల్ కు ప్రచారకర్తగా నియమితులయ్యారనే విషయం అందరికి తలిసిందే. ఆ యాడ్ షూటింగ్ లో భాగంగా ఆ సెట్ లోని రెండు స్టిల్స్ విడుదలయ్యాయి. అందులో ఎన్టీఆర్ ని చూసిన ప్రతిఒక్కరు తెగ మెచ్చుకుంటున్నారు. ఆయన నిజంగా ఎంతో యంగ్ గా, స్లిమ్ గా కనబడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఆ ఫోటోలను మీరు చూడండి మరి….