వైరల్ వీడియో : నాడు ఎన్టీఆర్ – నేడు బాలయ్య, ఒకే ఫ్రేములో అదుర్స్!

Thursday, March 29th, 2018, 11:40:52 AM IST

యువరత్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, లెజెండ్ ఎన్టీఆర్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కనున్న సినిమా “ఎన్టీఆర్ “. ఈ బయోపిక్ షూటింగ్ నేడు హైదరాబాద్ లోని శ్రీ రామ కృష్ణ సినీ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. అలానే టాలీవుడ్ కు చెందిన అతిరథమహారధులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసారు. విలక్షణ చిత్రాల దర్శకులు తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ అలానే వారాహి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్ర ముహూర్త సన్నివేశంలో బాలయ్య దుర్యోధనుడి గెటప్ లో అదరగొట్టారు. అలానే దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ లు అద్భుతంగా పలికించారు బాలయ్య. నాడు ఎన్టీఆర్ డైలాగ్ లు, నేడు బాలయ్య డైలాగ్ లు కలిపిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరు అద్భుతం అని మెచ్చుకుంటున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేసుకోండి మరి…..