వైరల్ ఫోటో : కారులో అనుష్క – విరాట్ లవ్

Monday, March 5th, 2018, 03:48:09 PM IST


ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా కాలం తరువాత విరామం దొరికింది. గత ఏడాది నుంచి తీరిక లేకుండా బిజీగా ఉన్న విరాట్ దక్షిణాఫ్రికా టూర్ అనంతరం రెస్ట్ దొరికింది. అయితే అనుష్కను పెళ్లి చేసుకున్న తరువాత విరాట్ కి చాల గ్యాప్ తరువాత హాలిడేస్ దొరగ్గానే అనుష్క బిజీ అయిపొయింది. షూటింగ్స్ ఉండడంతో ఆమె కూడా దేశాలు వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా తను నిర్మాతలతో మాట్లాడి డేట్స్ ని అడ్జస్ట్ చేసుకుంది.

దీంతో భర్త తో గడిపే సమయం దొరికింది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా అనుష్క భోపాల్ నుంచి ముంబై కి చేరుకోగా విరాట్ అనుష్కను పికప్ చేసుకునేందుకు ముంబై ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. అయితే రాగానే అనుష్క విరాట్ గుండెలను హత్తుకుంది. దీంతో ఆ సీన్ కెమెరాకు చిక్కడంతో ఫొటో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. విరాట్ అనుష్క జంట చాలా బావుందని ఫ్యాన్స్ చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క మూడు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉంది.