కోహ్లీని మించిన వాళ్లం మేము..!

Tuesday, February 14th, 2017, 06:11:42 PM IST


త్వరలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు అప్పుడే కవ్వింపు చర్యలకు దిగుతోంది. స్లెడ్జింగ్ కు మరో పేరు ఆస్ట్రేలియా అన్న విషయం ప్రపంచ క్రికెట్ దేశాలకు తెలుసు. అట మొదలు కాక ముందే ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే వారి వ్యూహం. క్రికెట్ లో ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ కు పాల్పడిన ఘటనలు కోకొల్లలు.ఆస్ట్రేలియా తో జరగబోయో సిరీస్ లో కెప్టెన్ కోహ్లీ కీలకం అన్న విషయం తెలిసిందే. దీనిని ముందే గుర్తెరిగిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కోహ్లీ పై మాటల యుద్ధం మొదలుపెట్టాడు. కోహ్లీ గురించి తమకు బాగా తెలుసు అని స్మిత్ అన్నారు.

కోహ్లీని అడ్డుకోవదానికి పథకాలు సిద్ధం చేశామని స్మిత్ అన్నాడు. అయితే వాటిని బయటపెట్టబోమని అన్నాడు. కోహ్లీ స్లెడ్జింగ్ కు దిగితే తాముకూడా వెనకాడబోమని స్మిత్ హెచ్చరించాడు. కోహ్లీ వరుసగా నాలుగు టెస్టుల్లో డబుల్ సెంచరీ లు సాధించిన విషయం తమకు తెలుసని అతడిని ఎదుర్కొనేందుకు సరైన ప్రణాలికతోనే వస్తున్నామని స్మిత్ అన్నాడు. ఆసీస్ మాజీ ఆటగాడు హస్సి మాట్లాడుతూ కోహ్లీపై స్లెడ్జింగ్ కు దిగవద్దని, అలా చేస్తే అతడు మరింత దూకుడు గా ఆడతాడని హస్సి ఆస్ట్రేలియా ఆటగాళ్లను హెచ్చరించాడు.