సోగ్గాడి ఆఫ‌ర్ మొద‌ట ఎవ‌రికెళ్లిందో తెలుసా?

Saturday, September 24th, 2016, 01:04:56 AM IST

virinchi-varama
నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. సంక్రాంతికి విడుద‌లై… చిన్న‌, పెద్ద‌, క్లాసూ, మాసూ అనే తేడాల్లేకుండా అంద‌రినీ ఆల‌రించింది. నాగార్జున‌ని తిరుగులేని మేటి హీరోగా నిలబెట్టింది. ఆ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ఇంట్ర‌డ్యూస్ అయిన క‌ళ్యాణ్‌కృష్ణ కూడా ఇప్పుడు కొత్త అవ‌కాశాల‌తో దూసుకెళుతున్నాడు. అన్న‌పూర్ణ కాంపౌండ్‌లోనే నాగ‌చైత‌న్య‌తో క‌లిసి సినిమా చేసే అవ‌కాశాన్ని సొంతం చేసుకొన్నాడు. అయితే `సోగ్గాడే చిన్నినాయ‌నా`ని తెరకెక్కించే అవ‌కాశం మొద‌ట విరించి వ‌ర్మ‌కి వ‌చ్చింద‌ట‌. `సోగ్గాడే…` క‌థ‌ని రాసిన పి.రామ్మోహ‌న్ మొద‌ట ఆ స్క్రిప్టుని విరించి చేతిలో పెట్టాడ‌ట‌. అయితే విరించి వ‌ర్మ మాత్రం త‌న క‌థైతేనే తాను తెర‌కెక్కించ‌డానికి సౌల‌భ్యంగా ఉంటుంద‌ని చెప్పాడ‌ట‌. దీంతో పి.రామ్మోహ‌న్ మ‌రో యువ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్‌కృష్ణ‌ని ఎంపిక చేసుకొన్నాడు. దాంతో విరించి వ‌ర్మ నాని కోసం `మ‌జ్ను` క‌థ‌ని త‌యారు చేసుకొని సినిమా చేశాడు. శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఆచిత్రం ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తోంది.