విశాఖలో కుదేలైన టీడీపీ..వైసీపీ జెండా మరింత రెపరెపలాడుతోంది

Monday, September 2nd, 2019, 12:00:04 AM IST

టీడీపీ పార్టీ వరస పెట్టి భారీ దెబ్బలు రుచి చూస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నేతలు టీడీపీ పార్టీకి రాం..రాం చెప్పేసి వైసీపీ, బీజేపీ పార్టీలోకీ వెళ్లిపోతున్నారు. గత వారం పది రోజుల నుండి విశాఖ జిల్లాలో మంచి పట్టు ఉన్న అడారి కుటుంబం టీడీపీకి వీడి వైసీపీ లోకి వెళ్లిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దానిని నిజం చేస్తూ ఈ రోజు విశాఖ డెయిరీ వ్యవస్థాపకుడు అడారి తులసీరావు మనవడు అడారి ఆనంద్ కుమార్ ఇప్పుడు వైసీపీలోకి చేరిపోయారు.

ఆడారి ఫ్యామిలీ చేరికతో విశాఖలో వైసీపీ బలం మరింత పెరిగింది. టీడీపీ బలం మరింత క్షిణించింది. విశాఖ డెయిరీ మూలంగా ఆడారి ఫ్యామిలీకి విశాఖ చుట్టూ పక్కల రైతుల్లో మంచి ఆదరణ ఉంది. ఆడారి ఫ్యామిలీ ఎటు ఉంటే అటే మేము నిలబడతామని చెప్పే రైతులు లక్షల్లో ఉన్నారు. అడారి తులసీరావు మనవడు అడారి ఆనంద్ కుమార్ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.

దీనితో టీడీపీ లో ఉంటే తమకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన ఆడారి ఫ్యామిలీ వైసీపీ నీడలోకి వచ్చింది. విశాఖలో కొంచం బలహీనంగా ఉన్న వైసీపీ గెలిచిన వెంటనే ఆ జిల్లాలో పట్టుకోసం ప్లాన్ వేసింది, అందులో భాగంగా తమకి లాభం కలిగించే నేతలను గుర్తించి వాళ్ళకి గాలం వేయటం స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్ లో భాగంగా ఆడారి ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకుంది.