బోగన్ దర్శకుడితో…విశాల్ ?

Wednesday, August 1st, 2018, 01:53:44 AM IST

తాజగా తెలుగులో అభిమన్యుడు సినిమా హిట్ తో మంచి ఊపుమీదున్న టూ లాంగ్వేజ్ స్టార్ విశాల్ .. ఇప్పటికే పండెకోడి చిత్రానికి సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. పందెంకోడి 2 ( సందకోడి 2 తమిళంలో ) తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లింగుస్వామి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బిజినెస్ పరంగా భారీ హైప్ క్రియేట్ అయింది. వచ్చే నెల అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తరువాత విశాల్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. లేటెస్ట్ గా బోగన్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మణ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అయ్యాడు. తాజాగా లక్ష్మణ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తాడట. ఇదికూడా మరో భిన్నమైన కథతో తెరకెక్కనుందట.

  •  
  •  
  •  
  •  

Comments