తెలుగు రైతుల కోసం విశాల్ పెద్ద మనసు ?

Sunday, June 10th, 2018, 01:15:43 AM IST

సినిమా హీరో విశాల్ రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కొన్ని రియల్ సంఘటనల విషయంలో పోరాడిన విశాల్. అలాగే ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నాడు. తాజాగా తమిళనాడు రైతుల కోసం తన సినిమా టికెట్ లో ఒక్క రూపాయి చొప్పున రైతులకు అందించే ప్రయత్నం చేసాడు. విశాల్ తాజాగా నటించిన అభిమన్యుడు సినిమా తెలుగు తమిళ భాషల్లో మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తెలుగులో మంచి విజయం సాధించడంతో విశాల్ ఈ లాభాలను తెలుగు రైతులకు పంచేందుకు సిద్ధం అయ్యాడు. తాజగా అయన ఈ సినిమా టికెట్ లోని 1 రూపాయి చొప్పున రైతులకు అందేలా చేస్తానని చెప్పాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ లో 12 కోట్లు వసూలు చేసి విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.