కబాలి ధన్షిక కు సపోర్ట్ గా నిలిచిన విశాల్.. శింబు తండ్రిపై ఫైర్

Sunday, October 1st, 2017, 01:30:35 AM IST

తమిళ సీనియర్ నటుడు టి రాజేందర్ రీసెంట్ గా కబాలి ఫెమ్ ధన్షిక పై మీడియా ముందు తీవ్ర స్థాయిలో కోప్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై స్పందించారు. సాధారణంగా ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు టెన్షన్స్ లో మర్చిపోతాము అది అర్ధం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్లు మాట్లాడి వారి విలువను చెడగొట్టుకున్నారని మంది పడ్డారు.

సోషల్ మీడియాలో అయితే ఈ విషయంపై నెటిజన్స్ ధన్షికకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె రాజేందర్ కాళ్లు మొక్కుతున్నా కూడా ఆయన అలానే మరియాదా లేకుండా మాట్లాడి ఆయన తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని కామెంట్ చేస్తున్నారు. రీసెంట్ హీరో విశాల్ కూడా ధన్షికకు సపోర్ట్ గా నిలిచారు. అంతే కాకుండా ఎంత అనుభవం ఉన్న రాజేందర్ ఆ విధంగా నటిని అందరిముందు అవమానించడం చాలా దారుణమని సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేశారు. సాధారణంగా తాను కూడా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా మంది పేర్లు మరచిపోతూ ఉంటాను. ఎవ్వరైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఆ విధంగా చేస్తారు. మన గురించి మాట్లాడకపోయినంత మాత్రాన గౌరవం తగ్గిపోతుందా అని కామెంట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments