హీరో విశాల్ త్యాగం .. శింబు కోసమే ?

Monday, January 22nd, 2018, 10:06:16 AM IST

ప్రస్తుతం హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న విశాల్ కు ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువయ్యాయి. కేవలం హీరోగానే చేస్తే పెద్దగా టెన్షన్స్ ఉండేవి కావు కానీ పరిశ్రమలో కీలక బాధ్యత అయినా నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, మరో వైపు నడిగర్ సంగం కార్యకలాపాలు చేసుకుంటున్నాడు కాబట్టి టెన్షన్ ఎక్కువయ్యాయి. ఇక తన సినిమాల విషయంలో అటు హీరోగానే కాకుండా నిర్మాతగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ వ్యవహారాలతో సతమవుతున్న విశాల్ .. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఈ మధ్య కీ అనే ఆడియో వేడుకలో పాల్గొన్న విశాల్ ను అక్కడున్న నిర్మాతలు ఇరికించే ప్రయత్నం చేశారట. గతంలో శింబు తో ఏ ఏ ఏ అనే సినిమా తీసిన మైఖేల్ రాయప్పన్ అనే నిర్మాత తీవ్ర నష్టాల్లో ఉన్నడని, ఆ నిర్మాత అలా నష్టపోవడానికి కారణం శింబు అని ఆందోళన చేసారు. ఈ విషయం పై నిర్మాతల మండలిలో కేసు వేస్తె ఎలాంటి చర్య తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ఈ విషయం పై విశాల్ స్పందిస్తూ ఆ సినిమా విషయంలో శింబు కు నోటీసులు పంపించామని పేర్కొన్నాడు. కానీ దానికి స్పందన లేదై కావాలంటే ఈ కీ సినిమా కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకుంటానని చెప్పడం విశేషం. అంతే కాకుండా నీరంతా మైఖేల్ కోసం ఓ సినిమా చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు శింబు విషయం గురించి మరచిపోండని చెప్పాడట ? విశాల్ ఎందుకు శింబు ని వెనకేసుకు వస్తున్నాడని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటీకే పలు వివాదాలతో శింబు రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శింబు కోసం విశాల్ త్యాగం చేయడం హాట్ టాపిక్ గా మారింది.