టెంప‌ర్ రీమేక్‌లో విశాల్?

Friday, June 8th, 2018, 12:48:29 AM IST

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టెంప‌ర్ ఎంత‌టి బ్లాక్‌బ‌స్ట‌రో తెలిసిందే. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించిన సినిమా ఇది. పూరి మార్క్ ఎనర్జీతో ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగే స్క్రీన్‌ప్లేతో మైమ‌రిపించింది. కాప్ డ్రామాల్లో నెగెటివ్ షేడ్‌ని హీరోయిజంగా గొప్ప‌గా చూపించాడు పూరి. మొత్తానికి ఈ సినిమా హిందీ రీమేక్‌లో అంతే ఎన‌ర్జిటిక్ గ‌య్ ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తున్నాడు. అక్క‌డ క‌ర‌ణ్ జోహార్‌- రోహిత్ శెట్టి వంటి దిగ్గ‌జాలు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది.

అదంతా స‌రే… ఈ సినిమా రీమేక్ హ‌క్కుల్ని విశాల్ ఛేజిక్కించుకోవ‌డంతో ర‌క‌ర‌కాల స్పెక్యులేష‌న్స్ ర‌న్ అవుతున్నాయి. అస‌లే విశాల్ అభిమ‌న్యుడు (ఇరుంబు తిరై) చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆ క్ర‌మంలోనే టెంప‌ర్‌ని త‌మిళంలో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. అయితే త‌మిళ్‌లో విశాల్ స్వ‌యంగా న‌టిస్తాడా? లేక కేవ‌లం విశాల్ ఫిలింఫ్యాక్ట‌రీలో నిర్మిస్తాడా? అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments