విశాల్ సరికొత్త ప్రయోగం!

Friday, May 4th, 2018, 10:26:04 PM IST


యంగ్ హీరో విశాల్ ఇప్పటివరకు మంచి మాస్ కథాంశాలతో చిత్రాలు చేసాడు. అయితే ప్రస్తుతం ఆయన కాస్త విభిన్న తరహా చిత్రాలను తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు. అలా వినూత్న కథాంశంతో నిర్మితమైన అయన ఇటీవలి సూపర్ హిట్ మూవీ ‘డిటెక్టీవ్’. కాగా ప్రస్తుతం ఆయన తమిళ తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధంగా వున్న ఇరుంబుతురై చిత్రం నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు పేరుతో రూపొందుతోంది.

ఈ చిత్రానికి నూతన దర్శకుడు పిఎస్ మిత్రన్ రూపొందించగా, యాక్షన్ కింగ్, ఒకప్పటి సీనియర్ హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం తో విశాల్ ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటివరకు హాలీవుడ్ చిత్రాలను విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ఏర్పాటు చేసే ఫుటేజ్ స్క్రీనింగ్ పద్దతనిన ఆయన ఈ చిత్రంతో తమిళ్ లో కూడా ఏర్పాటుచేయనున్నారు. అనగా చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు, వాటితాలూకు చిత్రీకరణ విశేషాలను ముందుగానే మీడియా కి చూపించడమన్నమాట. విశాల్ కూడా తమిళ మీడియా వారికి ఈ చిత్ర ఫుటేజ్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే దీనివల్ల సినిమా చూసే ముందు ఒక మంచి, ఫీల్ అలానే మూడ్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందట. నిజానికి ఇండియాలో మాత్రం ఇది కొత్త. తెలుగు సినిమాలకు కూడా ఇటువంటి విధానం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా అభిమన్యుడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో మే 11న విడుదల కానుంది…..

Comments