జూన్ చివ‌రి వారంలో `విశ్వ‌రూపం 2`

Thursday, May 24th, 2018, 10:48:41 AM IST

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన `విశ్వ‌రూపం` పార్ట్ 1 ఏ స్థాయి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రిలీజైంది. ప్రేక్ష‌కాభిమానులు అంచ‌నాల్ని మించి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అందుకే త్వ‌ర‌లో రిలీజ్‌కి రానున్న విశ్వ‌రూపం 2 పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీ విష‌య‌మై ఇన్నాళ్లు స‌రైన క్లారిటీ రాలేదు.

ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎట్ట‌కేల‌కు ఈ సినిమా రిలీజ్ ముంగిట‌కు వ‌స్తోంది. ఆ మేర‌కు ఆస్కార్ ర‌విచంద్ర‌న్ బృందం రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సెన్సార్ యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. జూన్ చివ‌రి వారంలో సినిమా రిలీజ్ కానుంఇ. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారని స‌మాచారం.

  •  
  •  
  •  
  •  

Comments