`విశ్వ‌రూపం 3` సీరియ‌స్ ప్లానింగ్?

Wednesday, July 25th, 2018, 09:10:47 PM IST


విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన‌ `విశ్వ‌రూపం 2` రిలీజ్ బ‌రిలో ఉందిప్పుడు. ఎన్నో ఒడిదుడుకుల న‌డుమ ఈ సినిమా రిలీజ్ అంత‌కంత‌కు వాయిదాప‌డిన సంగ‌తి తెలిసిందే. ఏ క‌ష్టం వ‌చ్చినా క‌మ‌ల్ ఎదురెళ్లాడు. చివ‌ర‌కు త‌న డ్రీమ్ ప్రాజెక్టుని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ఆగ‌స్టు 10 రిలీజ్ ముహూర్తం. ఎట్టి ప‌రిస్థితిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు అన్నివిధాలా లైన్ క్లియ‌ర్ చేసుకున్నాడు.

ఓవైపు విశ్వ‌రూపంకి మూడో పార్ట్ తెర‌కెక్కించేందుకు క‌మ‌ల్ సీరియ‌స్‌గానే ప్లానింగులో ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. విశ్వ‌రూపం చిత్రం 2013లో రిలీజైంది. ఐదేళ్ల‌కు విశ్వ‌రూపం సీక్వెల్ క‌థ‌తో పార్ట్ 2ని రిలీజ్ చేస్తున్నాడు. ఈ రెండో భాగంలో మ‌రో సినిమా తీసేందుకు ఆస్కారం క‌ల్పించాడ‌ట క‌మ‌ల్‌. ఈ సీరియ‌స్ స్పై థ్రిల్ల‌ర్ క్లైమాక్స్‌లో ఈ విష‌యం వెల్ల‌డిస్తార‌ట‌. `విశ్వ‌రూపం -2` క‌థ కు మొద‌టి భాగంతో లింక్ ఉంది. మేజ‌ర్ విస‌మ్ అహ్మ‌ద్ క‌శ్మీరీ పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తారు. రా సీక్రెట్ ఏజెంట్‌గా అత‌డి పాత్ర‌కు కంటిన్యుటీని అలానే ఉంచార‌ట‌. పార్ట్ -1లో న‌టించిన రాహుల్‌బోస్‌, పూజా కుమార్‌, శేఖ‌ర్ క‌పూర్ పాత్ర‌ల‌కు రెండో భాగంలో ఎక్స్‌టెన్ష‌న్ య‌థావిధిగానే ఉంది. ఇక తాజా భాగంలో ఆండ్రియా గ్లామ‌ర్ అద‌న‌పు ఆకర్ష‌ణ కానుంద‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments