ఆ వీడియోతో టీం ఇండియా ఫ్యాన్స్ ని రెచ్చకొట్టిన వివేక్ ఒబెరాయ్..ఆటాడుకుంటున్న నెటిజన్లు

Sunday, July 14th, 2019, 12:19:39 PM IST

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఈ మధ్య కాలంలో ట్విట్టర్ వేదికగా అర్ధం పర్థం లేని పోస్టులు చేస్తూ, నెటిజన్లు తో చివాట్లు తింటున్నాడు . గతంలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ విషయంలో ఒక పోస్ట్ పెట్టటంతో అది తీవ్ర దుమారాన్ని లేపింది. దీనిపై అప్పట్లో బాలీవుడ్ ప్రముఖులు సైతం వివేక్ మీద విమర్శలు చేశారు. తాజాగా వరల్డ్ కప్ లో టీం ఇండియా సెమీస్ లో ఓడిపోయి టోర్నీ నుండి తప్పుకుంది. టీం ఇండియా వరల్డ్ కప్ సాధిస్తుందని టీం ఇండియా ఫ్యాన్స్ గట్టిగా కోరుకున్నారు. కానీ అది జరగలేదు.

దీనిపై స్పదించిన వివేక్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఒక అమ్మాయి ఎదురుగా వస్తున్నా ఒక వ్యక్తిని వాటేసుకోబోతుంది, ఆ వ్యక్తి కూడా ఆమెని దగ్గరకి తీసుకోవటానికి వస్తాడు, ఆ సమయంలో ఆమె అతనిని కాకుండా అతని వెనుక ఉంటే మరో అందమైన వ్యక్తిని వాటేసుకుంటుంది. దీనితో ముందున్న వ్యక్తి ఇబ్బందికరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. టీం ఇండియా ఫ్యాన్స్ కి కూడా ఇలాగే జరిగిదంటూ ఆ వీడియో పోస్ట్ చేసి, ఆ కామెంట్స్ పెట్టాడు. దీనితో ఫ్యాన్స్ అతని తీరుపై పెద్ద ఎత్తున్న విమర్శలు చేస్తున్నారు.

ఎలాంటి పనిపాట లేకుండా ఖాళీగా ఉంటే ఇలాంటి పోస్టులే వస్తుంటాయి, ఏమైనా పని చేసుకో, ముందు నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో చూపించుకో, టీం ఇండియా ఆటగాళ్లు ఎవరైనా బాలీవుడ్ సినిమాలు తీస్తే నీకంటే ఎక్కువ ఫ్యాన్స్ నీ సంపాదిస్తారు. ముందు నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టుకో, అప్పట్లో ఐశ్వర్యరాయ్ విషయంలో పడిన చివాట్లు ఇంకా సరిపోలేదా..మళ్ళీ మరో పోస్ట్ తో వచ్చి తిట్లు తింటున్నావు అంటూ నెటిజన్లు వివేక్ మీద విరుచుకుపడుతున్నారు..