ఈ హీరో వారిపాలిట నిజంగా పరిటాల రవన్నే !!

Monday, September 19th, 2016, 11:54:37 PM IST

vivek-oberai
వర్మ దర్శకత్వంలో వచ్చిన ”రక్త చరిత్ర” సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పరిటాల రవి పాత్రలో జీవించిన నటుడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న వివేక్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ హీరో సినిమాలకంటే కూడా సేవ కార్యక్రమాలతో ఎక్కువ పాపులర్ అయ్యాడు. తాజాగా వివేక్ చేస్తున్న మంచి పని చూసి ప్రతి ఒక్కరు శబాష్ అనవలసిందే ? ఎందుకంటారా … వివేక్ మహారాష్ట్రలో తక్కువ ఆదాయం ఉండి .. సొంత ఇల్లు కావాలనుకునే వారికోసం తక్కువ ఖర్చులో అయన ఇళ్లను నిర్మించి ఇస్తాడట !! 2022 నాటికి దేశంలో ప్రతిఒక్కరికి సొంతంగా ఇల్లు ఉండాలన్న ప్రధాని మోడీ కోరిక ప్రకారం వివేక్ ఈ ప్రాజెక్ట్ ని చేపట్టాడు. ఈ ఏడాది చివరికల్లా 5 లక్షల మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ద్యేయంగా పెట్టుకున్నాడట ! మిషన్ 360 పేరుతొ రూపొందే ఈ కార్యక్రమం మహారాష్ట్రలోని 360 ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపాడు. ఎలాంటి లాభాలు ఆశించకుండా అందరికి అందుబాటులో ఉండేలా దీని ధరను నిర్ణయించారట. అయితే ఈ సొంతింటి ధర ఎంతో తెలుసా ఏడు లక్షల తొంబై వేలేనట !! నిజంగా ఇది గొప్ప సాహసమనే చెప్పాలి. మహారాష్ట్రలో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో కూడా చేపడతానని అంటున్నాడు. నిజంగా వివేక్ పరిటాల రవి లాంటోడే కదా .. ఎందుకంటే ప్రజలకోసం పాటుపడుతున్నారు కదా !! ఏమంటారు ?