మగవాళ్లను కూడా గదుల్లోకి లాగేస్తున్నారు

Tuesday, March 13th, 2018, 05:55:45 PM IST

హాలీవుడ్ లో బడా నిర్మాత లైంగిక వేధింపుల విషయం బయటపడ్డప్పటి నుంచి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కూడా అనేక రకాల నిజాలు బయటపడ్డాయి. చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా మీటూ అనే ట్యాగ్ తో తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని తెలిపారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో మగవారు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని టాక్ వస్తోంది. ఆ విషయంపై దర్శక నిర్మాత హేట్ స్టోరీ ఫెమ్ వివేక్‌ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

గతంలో తన ఫ్యామిలీ రిలేటివ్ సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తుండగా ఒక బడా దర్శక నిర్మాత దగ్గరికి పంపించాను. అయితే అక్కడ అతనికి లైంగిక వేధింపులు ఎదురవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందని వివేక్ తెలుపడం హాట్ టాపిక్ గా మారింది. మగవాళ్లు కూడా మీటు అని వాడక తప్పదని చెప్పారు. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. మగాళ్లని గదుల్లోకి లాగేస్తున్నారు. వేదించే బడా హీరోలు దర్శకుల సంఖ్య చాలా పెద్దగా ఉంది. చాలా మందికి అమాయకులు వారి కింద నలిగిపోతున్నారు వారు దైర్యంగా ఎదుర్కోలేరు. అందుకే చాలా మంది కంగనా రనౌత్ లు రావాలని అయినా మీడియాకు వివరించారు.