పేదలకోసం ఐదు లక్షల ఇళ్లు..స్టార్ హీరో సంచలన నిర్ణయం..!

Tuesday, September 27th, 2016, 03:57:27 PM IST

vivek
బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్టార్ హీరోనే కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త కూడా. ప్రస్తుతం వివేక్ నిర్మాణరంగంలోకి దిగాడు. ముంబై లో పేదలకు ఐదు లక్షల ఇల్లు కట్టించడానికి పూనుకున్నాడు.ఫ్రీగా కాకపోయినా.. సరసమైన ధరకు పేదలకొరకు ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నాడు.

ఒక్కో ఇంటిని రూ. 8 లక్షలకే నిర్మించి ఇవ్వాలన్నది వివేక్ ఆశయం.పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న ప్రధాని మాటలను వివేక్ ఆదర్శంగా తీసుకున్నాడు.దీనికోసం ప్రభుత్వం నించి కాకుండా ప్రయివేటు వ్యక్తులనుంచి భూమిని సేకరించాలని వివేక్ నిర్ణయించుకున్నాడు.మిగతా రాష్ట్రాలనుంచి కూడా ఇల్లు కట్టివ్వాలని అడుగు తున్నారట వివేక్ ని. ముంబైలో పూర్తి కాగానే మిగతా రాష్ట్రాల గురించి ఆలోచిస్తానని వివేక్ అంటున్నాడు.రూ.8 లక్షలకు ఇల్లు అంటే నిరుపేదలు చెల్లించలేకపోయినా.. ఇది మధ్యతరగతి వారికి మేలు చేసే అంశమే అని అంటున్నారు.