వైజాగ్ ఫిలింన‌గ‌ర్‌క్ల‌బ్ యాక్టివ్ మోడ్‌

Sunday, May 20th, 2018, 04:56:55 PM IST

వైజాగ్ టాలీవుడ్ … రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం వినిపించిన మాట ఇది. టాలీవుడ్ వైజాగ్‌కి త‌ర‌లి వెల్లిపోతోంద‌న్న ప్ర‌చారం సాగింది. ఆ దిశ‌గా కొన్ని ప్ర‌య‌త్నాలు సాగాయి. వైజాగ్ బీచ్‌రోడ్‌లోని కాపులుప్పాడ ప‌రిస‌రాల్లో ఫిలింఛాంబ‌ర్ ఏర్పాటున‌కు పునాది రాయి వేయ‌డం.. విశాఖ రామానాయుడు స్టూడియోస్ ప‌రిస‌రాల్లో ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ (ఎఫ్ఎన్‌సీసీ) ఏర్పాటు చేయ‌డంతో ఉత్త‌రాది జిల్లాలో ఆస‌క్తి పెరిగింది. ఇప్ప‌టికే వైజాగ్ బీచ్‌ను ఆనుకుని రామానాయుడు కొండ‌కు ఎదురుగా నాలుగు ఎక‌రాల్లో ఎఫ్ఎన్‌సీసీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు ఇదివ‌ర‌కూ.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం… వైజాగ్ ఎఫ్ఎన్‌సీసీలో 200 మంది స‌భ్యులు చేరారుట‌. ఇప్ప‌టికీ ఇందులో మెంబ‌ర్ల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. ఈ మెంబ‌ర్‌షిప్‌కి 3ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతోందిట‌. సువిశాలంగా బీచ్ తిన్నెల్లో ఏర్పాటు చేసిన ఈ ఎఫ్ఎన్‌సీసీ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డంతో ఇక్క‌డ చేరేవారి సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోందిట‌. టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌.రామారావు సార‌థ్యంలోని ఈ క్ల‌బ్ లో ఇప్ప‌టికే ప‌లు యాక్టివిటీస్ ప్రారంభ‌మ‌య్యాయి. ఇక మునుముందు విశాఖ ఎఫ్ఎన్‌సీసీకి రామానాయుడు స్టూడియోస్‌ని ఆనుకుని 15 ఎక‌రాల్లో నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది. అలానే విశాఖ‌లో ఫిలింయాక్టివిటీస్‌ని పెంచేందుకు ఉన్న ఆస్కారాల‌పైనా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం… క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన మెజారిటీ పార్ట్ క్లారిటీ వ‌చ్చేస్తుండ‌డంతో త‌దుప‌రి చంద్ర‌బాబు కొత్త టాలీవుడ్ ఏర్పాటుపై దృష్టిసారించ‌నున్నార‌ని చెబుతున్నారు. ఇందుకు మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు, అయ్య‌న్న పాత్రుడు బృందం స‌హా ప‌లువురి నుంచి ప్ర‌తిపాద‌న‌లు బాబుకు అందాయిట‌.

  •  
  •  
  •  
  •  

Comments