చిన్న‌మ్మ‌ను ఎక్కించడానికి ఖైదీల బ‌స్సు సిద్ధం!

Tuesday, February 14th, 2017, 08:52:01 PM IST


చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌పై కోర్టు తీర్పు వెలువ‌డింది. నాలుగేళ్ల పాటు జైలు ఊచ‌లు లెక్కించేందుకు అమ్మ సిద్ధ‌మైపోయింది. ఎంత పెద్ద హోదాలో ఉన్నా.. సీఎం కాబోయి కాలేక‌పోయినా.. ఇప్పుడు మాత్రం న్యాయ‌స్థానం ముందు ఖైదీనే త‌ను. అందుకే త‌న‌ని త‌ర‌లించేందుకు రిసార్ట్ ద‌గ్గ‌ర శ‌క‌టం వెయిటింగులో ఉంది. ఖైదీల్ని ఎక్కించే బ‌స్సును ఇప్ప‌టికే పోలీసులు రెడీ చేశారు. చిన్న‌మ్మ‌ను ఇందులో ఏ క్ష‌ణ‌మైనా త‌రిలంచే ఛాన్సుంది.

బెంగ‌ళూరు జైలులో నేర‌స్తురాలిగా ఖైదీలాగా నంబ‌ర్ వేసిన డ్ర‌స్సు తొడిగి .. అక్క‌డ పెట్టిన భోజ‌నం తిని, డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇది సీఎం కాబోయి చివ‌రి నిమిషంలో మిస్స‌యిన ఓ నేత‌గా శ‌శిక‌ళ‌కు మింగుడు ప‌డ‌ని సీనే మ‌రి! ఓవైపు చిన్న‌మ్మ ప‌రిస్థితే ఇలా ఉంటే, మ‌రోవైపు ప‌న్నీర్ వ‌ర్గం కూడా అంతే నిరాశ‌నిస్ప్ర‌హ‌ల‌తో ఉంది. గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ లేకుండా బ్లాక్ అయిపోవ‌డంతో ప‌న్నీర్ సైతం జీరో అయిపోయారు.