తెలంగాణ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాజీనామా.. ఎందుకంటే..!

Thursday, June 25th, 2020, 02:38:02 AM IST

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి ఐపీఎస్ వినోద్ కుమార్ సింగ్(వీకే సింగ్) రాజీనామా చేశారు. ప్రస్తుతం టీఎస్‌పీఏ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వీకే సింగ్ తన రాజీనామా లేఖను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వీకే సింగ్ పంపారు.

అయితే కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వీకే సింగ్ ఇదివరకే తెలంగాణ ప్రభుత్వ సీఎస్‌కు కూడా లేఖ రాశారు. డీజీపీగా తనకు పదోన్నతి కల్పించాలని, అందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని కోరారు. అయితే పోలీస్ అకాడమీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వృధానే అని అన్న మాటలు పోలీస్ శాఖలో పెనుదుమారాన్ని రేపాయి. తాను పదోన్నతికి పనికిరానంటే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.