హుజూర్‌నగర్: ముగిసిన ఓటింగ్.. భారీగా పోలింగ్..!

Monday, October 21st, 2019, 06:29:32 PM IST

హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అయితే ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి, అధికార పార్టీ నుంచి సైది రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయి, స్వతంత్రులుగా తీన్మార్ మల్లన్న వంటి వారు ముఖ్యంగా బరిలో ఉన్నారు.

అయితే ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతగా ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్‌కి జనాలు భారీగా హాజరు కావడంతో దాదాపు 84.15 శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో 85.96 శాతం నమోదయ్యింది. అయితే ఉప ఎన్నికలో కూడా ఓటర్లు పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అయితే ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 24న ఫలితాలు వెల్లడవుతాయి.